ట్విటర్‌’కు దీదీ సపోర్ట్

కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ పై కేంద్రం చర్యలని ఆమె ఖండించారు. 

‘నేను దీన్ని ఖండిస్తున్నాను. వారు ట్విటర్‌ను అదుపు చేయలేరు. అందుకే దాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. వారు కట్టడి చేయలేని ప్రతి ఒక్కరితో ఇలాగే ప్రవర్తిస్తారు. వారు నన్ను నియంత్రించలేరు. అందుకే నా ప్రభుత్వాన్ని కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని మమత అన్నారు.

నూతన ఐటీ నిబంధనలు పాటించనందుకు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో ట్విటర్‌పై కేంద్రం చర్యలు ప్రారంభించింది. దాంతో ‘సురక్షిత ఆశ్రయం'(సేఫ్ హార్బర్)అనే రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది.