రాజమౌళి హీరోలని వదిలేశాడు

రాజమౌళితో సినిమా చేస్తున్న టైమ్ లో మరో సినిమా చేయడానికి వీల్లేదు. హీరోలకు ఆయన పెట్టిన కండిషన్ ఇది. అందుకే బాహుబలి కి అన్నేళ్లు తీసుకున్నా.. ప్రభాస్ మరో సినిమా చేయలేదు. బాహుబలి 2 పూర్తయి.. జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మరో సినిమా చేశాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ హీరోలది అదే పరిస్థితి.  #ఆర్ఆర్ఆర్ పూర్తయ్యేవరకు మరో సినిమా సినిమా ఛాన్సే లేదు. ఐతే లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? హీరోలకు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. జులైతో షూటింగ్ పూర్తికానుంది. ఇతర సినిమాలు చేసుకోవచ్చని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా మీదకు వెళ్తారని తెలుస్తోంది. చరణ్ మాత్రం ఇంకా సినిమా ఫిక్స్ చేసుకోవాల్సి వుంది. శంకర్ తో సినిమా ఆలస్యం అయ్యేలా వుంది కనుక, ఈ గ్యాప్ లో మరో సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. దాని కోసం డైరక్టర్ ను అన్వేషిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ షూట్ పార్టీ మహా అయితే 20 రోజులకు మించి లేదని తెలుస్తోంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా వుంది.