ఏపీలో నిలకడగా కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గింది. కేసులు తగ్గుముఖం పట్టాయ్. ఏపీలోనూ కరోనా కంట్రోల్ లోకి వస్తోంది. అయితే గత డ్నాలుగు రోజులుగా రాష్ట్రంలో నిలకడగా కేసులు నమోదవుతున్నాయ్. 60వేలకుపైగా కేసులు, 50కిపైగా మరణాలు సంభవిస్తున్నాయి.
గడిచిన 24గంటల్లో ఏపీలో 6,341 కేసులు నమోదయ్యాయి. 57 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మరణించారు. కరోనా నుంచి నిన్న 8,486 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి.