ప్రియదర్శి సీరియస్ కావొద్దు.. అభిమానుల రిక్వెస్ట్ !
కమెడియన్ కామెడీ చేస్తేనే బాగుంటుంది. అలా కాదని సీరియస్ పాత్ర చేస్తా. తనలోని మరో యాంగిల్ చూపిస్తా అంటే.. ‘ఇన్ ది నేమ్ ఆఫ్గాడ్’లో ప్రియదర్శిలా ఉంటుంది. కమెడియన్ గా మెప్పించిన ప్రియదర్శి.. తనలో దాగి ఉన్న మరో కోణాన్ని పరిచయం చేసేందుకు ఈ వెబ్ సిరీస్లో నటించాడు. విద్యా సాగర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి ఆది అనే సీరియస్ పాత్రలో కనిపించారు.
ప్రియదర్శి నటనకి వంకపెట్టలేం. కానీ కథ-కథనాలు గ్రిప్పింగ్ గా సాగలేదు. థ్రిల్లర్ సిరీస్ ఫార్మెట్ లో కథని అద్భుతంగా మొదలెట్టాడు దర్శకుడు. తొలి రెండు ఏపీసోడ్స్ ఆసక్తిగా సాగుతాయి. కానీ ముందుకు వెళ్లే కొద్దీ.. పట్టు సడలింది. అన్నీ ఏపీసోడ్స్ చూసేలోపు ఇందులో ప్రియదర్శి కమెడియన్ కి తక్కువ.. సీరియస్ పాత్రకి ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. బొత్తిగా ఆయనకు సూట్ కానీ పాత్ర ఇది. అందుకే ప్రియదర్శిని మరోసారి సీరియస్ కావొద్దు అని ఆయన అభిమానులు వేడుకుంటున్నారు. అదే.. సీరియస్ పాత్రలు చేయొద్దని కోరుతున్నారు.