సడెన్ గా రజనీ అమెరికా పయనం.. ఎందుకు ?
సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు. ఉన్నట్టుండి సడెన్ గా అమెరికా పయనం పెట్టుకోవడంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజనీకి మళ్లీ ఏమైంది ? అంటూ ఆరా తీయడం మొదలెట్టారు. అయితే ఇది సడెన్ ప్రయాణం కాదు, దాదాపు నెల రోజుల కిందటే ప్లాన్ చేసిన కార్యక్రమం అట. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసమే రజనీ అమెరికా వెళ్తున్నారని తెలిసింది.
ఐదేళ్ల కిందట రజనీకి అమెరికాలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. అప్పటి నుంచి ప్రతి యేడాది వైద్య పరీక్షల కోసం అక్కడికి వెళ్తుంటారు. ఇందులో భాగంగా గతేడాదే ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యమైంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం ఆమెరికాలోనే ఉన్నాడు. ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అతడితో పాటు కుటుంబం మొత్తం అక్కడే ఉంది. ఈసారి రజనీని ధనుష్ దగ్గరుండి చూసుకుంటాడు. అంతేకాదు.. అమెరికాలో రజనీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని.. ధనుష్ అందరితో కలిసి భారత్ కు తిరిగి రానున్నారని తెలిసింది.
ప్రస్తుతం రజనీ అన్నాత్తై సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ మాత్రం చెప్పాల్సి ఉంది. అమెరికా నుంచి తిరిగొచ్చాక అన్నాత్తె డబ్బింగ్ చెప్పనున్నారు. ఆ తర్వాత రజనీ కొత్త సినిమాని మొదలెట్టనున్నారు.