ప్ర‌త్యేక హోదాపై నిల‌దీసిన బాబు..! ప్ర‌సంగం అడ్డుకున్న రాజ్ నాథ్ సింగ్ !!

ఢిల్లీలో జ‌రిగిన నీతీ ఆయోగ్ స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. విభ‌జ‌న చ‌ట్టం హామీల‌పై నిల‌దీశారు. నీతీ ఆయోగ్ ఎజెండా అంశాల ప్ర‌స్తావ‌న‌కు ముందే చంద్ర‌బాబు ఏపీపై కేంద్రం వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయాల‌ని కోరారు. ప్ర‌త్యేక హోదాతో పాటు పోల‌వ‌రానికి నిధుల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చ‌డంలో కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని నిల‌దీవారు.

అంశాల‌వారీగా 13పేజీల‌ను 20నిమిషాల‌లో చ‌దివి వినిపించారు. ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. దాదాపు ఏడు నిమిషాలు మాట్లాడిన త‌రువాత ఆయ‌న ప్ర‌సంగాన్ని కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుకున్నారు. ఇచ్చిన స‌మ‌యం అయిపోయిందంటూ ముగించాల‌న్నారు. చంద్ర‌బాబు ఏమీ ప‌ట్టించుకోకుండా చెప్పాల‌నుకున్న‌ది చెప్పేశారు. విభ‌జ‌న హామీల‌పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఏపీ ప్ర‌త్యేక‌హోదా ఇచ్చి తీరాల్సిందేన‌న్నారు. చంద్ర‌బాబు లేవ‌నెత్తిన అంశానికి మ‌ద్ద‌తుగా బీహార్ సీఎం నితీష్ మ‌ద్ద‌తు తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్నారు.