ఇది బోల్డ్ ఇంటర్వ్యూ కాదు.. దానమ్మమ్మ !
ఆర్జీవీతో అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ.. హాట్ హాట్ జిమ్ ఫోటోలు కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయ్. ఇక శుక్రవారం టీజర్ ని వదిలారు. టీజర్ ని చూసిన వాళ్లు.. అరియానాని ఆర్జీవీ అన్నీ యాంగిల్స్ లో వాడేశారని కామెంట్స్ చేశారు. కానీ ఇది బోల్డ్ ఇంటర్వ్యూ కాదు.. దానమ్మమ్మ. ఇంటర్వ్యూ చేస్తూనే.. అరియానాతో సెక్స్ చేశాడు ఆర్జీవీ.
అరియానా ఎంట్రీ ఇవ్వగానే నువ్వంటే ఇష్టమని ఆర్జీవీ చెప్పేశాడు. అంతేకాదు.. బిగ్ బాస్ ఇంట్లో నీతో పాటు ఉన్న అమ్మాయిలు వేస్ట్ ఫేస్ లు. కేవలం నీ కోసమే ఓ సారి బిగ్ బాస్ చూశానని చెప్పేశాడు. ఇక అటు ఆర్జీవి.. ఇటు అరియానా సెక్స్ మేటరుని వదల్లేదు. ఇద్దరు సెక్సీపై విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో మీరు ఎంతకాలం రిలేషన్ షిప్ లో ఉంటారని ఆర్జీవీని అరియానా ప్రశ్నించింది. గతంలో చాలారోజులు ఉండేవాడిని. ఆ తర్వాత అది ఒక సంవత్సరం.. ఒక నెల.. ఒకరోజు.. ఇప్పుడు గంటకు మారింది. అమ్మాయితో సెక్స్ చేసిన టైమ్ లోనే రిలేషన్ షిప్ లో ఉంటానని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో హద్దులు దాటి మరో ప్రశ్న అడిగింది అరియానా. మీరు లాస్ట్ సారి ఎప్పుడు సెక్స్ లో పాల్గొన్నారు ? అని అడిగింది. దానికి నువ్వు వచ్చే గంట ముందేనన్నాడు ఆర్జీవీ. అంతేకాదు.. ప్రస్తుతం నీతోనూ సెక్స్ చేస్తున్నా. నువ్వు జిమ్ చేస్తున్నప్పుడు నిన్ను చూస్తూ ఆస్వాదిస్తున్నాని చెప్పుకొచ్చాడు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూని మొత్తం మాటల్లో చెప్పలేం. చూడాల్సిందే.