త్రివిక్రమ్ తో సూర్య సినిమా.. ఖరారు!

కోలీవుడ్ హీరోలు నేరుగా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ధనుష్ తెలుగు సినిమా ఫిక్సయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నారు. ఇక బోయపాటి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ సైతం సూర్య కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. 

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఆ త‌ర‌వాతి సినిమా సూర్య‌తోనే అని స‌మాచారం. అటు బోయ‌పాటి, ఇటు త్రివిక్ర‌మ్.. వీరిద్ద‌రూ సూర్య‌తో సినిమాలు చేయ‌డం దాదాపుగా ఖాయం. అయితే.. ఎవ‌రిది ముందు? ఎవ‌రిది త‌ర‌వాత‌? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.