తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత
తెలంగాణ పూర్తిగా అన్ లాక్ అయింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదికలని అందించారు. ఈ నివేదికలని పరిశీలించిన కేబినేట్ లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రానా నిర్లక్ష్యం తగదు. తప్పకుండా మాస్క్ ధరించాలి. సామాజిక దూరం పాటించాలని సూచించింది. జులై 1 నుంచి స్కూల్స్, కాలేజీలు తెరవాలని ఆదేశించింది.