WTC Final : టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్

ఐసీసీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లో వర్షంతో తొలిరోజు తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. రెండోజు మాత్రం వరుణుడు కరుణించాడు. దీంతో ఆట ఆరంభం అయింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. 

ప్రస్తుతం టీమిండియా 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 34, శుభమన్ గిల్ 27 పరులతో ఆడుతున్నారు. ఇక వర్షంతో తొలిరోజు ఆట క్యాన్సిల్ అయినా.. టీమిండియాలో మార్పులేమీ చేయలేదు. వర్షం పడటంతో ఇద్దరు అస్పిన్నర్లలో ఒకరిని తొలగించి అదనపు బ్యాట్స్ మెన్స్ తీసుకొనే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. కానీ కోహ్లీ అలాంటి మార్పులేవీ చేయలేదు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగారు.