WTC Final : పట్టుబిస్తున్న కివీస్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ క్రమంగా పట్టు బిస్తోంది. మూడోరోజు ఆటలో కివీస్ బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అదరగొట్టింది.తొలుత భారత్‌ను 217 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఆ తర్వాత జట్టు ఓపెనర్లు టామ్‌ లాథమ్ (30; 104 బంతుల్లో 3×4), డెవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో 6×4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి కివీస్‌కు బలమైన పునాది వేశారు. ప్రస్తుతం కివీస్ 2 వికెట్ల నష్టానికి 101 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. క్రీజులో విలియమ్స్ సన్ (12), టేలర్ (0) ఉన్నారు.

నాల్గోరోజు టీమిండియా బౌలర్లు సంచలన బౌలింగ్ తో కివీస్ నడ్డి విరిస్తే తప్ప.. లేదంటే ఆ జట్టు మ్యాచ్ పై పట్టుబిగించినట్టే. నాల్గోరోజు పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందా ? లేక పేస్ కు సహకరిస్తుందా ?? అన్నదానిపై మ్యాచ్ ఫలితం టర్న్ కానుంది. ఇక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కనీసం 250 పరుగులైనా  చేస్తుందని భావించారు. కానీ ఆఖరులో టపా టపా వికెట్లు పడిపోయాయ్. ఇషాంత్‌(4), బుమ్రా(0), జడేజా(15) ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 217 కు తెరపడింది.