ఏపీలో రాత్రి లాక్‌డౌన్‌

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నాయ్. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా పూర్థిస్థాయిలో లాక్‌డౌన్‌ ని ఎత్తేసిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి విద్యాసంస్థలని తెరవనుంది. థియేటర్స్ కి వందశాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చింది. 

మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం రాత్రి కర్ఫ్యూను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం గం.6 నుంచి సాయంత్రం గం.6 వరకూ పెంచారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయనున్నారు. దీంతో ఏపీలో రాత్రి లాక్‌డౌన్‌ అమలు అవుతోంది అన్నమాట.

కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేశారు. ఇకపై ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలు ఉండనున్నాయి. ఇక కేసులు ఎక్కువ వున్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపును మధ్యాహ్నం గం.2 వరకే ఇచ్చారు.