నయన్ లో నచ్చింది అదే : విఘ్నేష్
స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాల గురించి తెలిసిందే. మొదట శింబుతో ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడింది. వీరిద్దరితో విడిపోయిన తర్వాత యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ కి దగ్గరైంది. ప్రస్తుతం వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. పెళ్లి మాట ఎత్తడం లేదు. కానీ అన్నీ చేసేస్తున్నారు. వీరిద్దరు చాన్నాళ్లుగా కలిసే ఉంటున్నారు. కలిసి కాపురం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి.
ఈ ప్రేమ వ్యవహారాలు పక్కనపెడితే.. ఇటీవల విఘ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్ తో ముచ్చటించారు. విఘ్నేష్ లైవ్ లోకి వస్తే నయన్ గురించి అడక్కుండా నెటిజన్స్ ఉండగలరా ? ఆమె గురించి బోలేడు ప్రశ్నలు వేసేశారు. ఓ నెటిజన్ నయనతారలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి ? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ‘ఆమె ఆత్మస్థైర్యం’ అంటూ విఘ్నేష్ సమాధానం ఇచ్చారు.అయితే రెండు లవ్ ఫెల్యూర్స్ తర్వాత ఆ మాత్రం ఆత్మస్థైర్యం ఉండకుంటే ఎలా ? జనాలు గుసగుసలాడుకుంటున్నారు.