పవన్’ని మోసం చేస్తున్న హాట్ బ్యూటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మోసం చేస్తుంది అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ కోసం వీరిద్దరు జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదో పిరియాడికల్ డ్రామ్. మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. కథ  ప్రకారం ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 3 షేడ్స్ లో కనిపించబోతున్నాడని సమాచారమ్. వజ్రాల దొంగ వీరమల్లుగా పవన్ ఓ షేడ్ లో కనిపించబోతున్నాడు. దీంతో పాటు సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా, దేశం కోసం పోరాడే వీరుడిగా కూడా పవన్ కనిపించనున్నారని తెలిసింది.

ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ఆసక్తికరమైన విషయం బయటికి తెలిసింది. సినిమాలో నిధి షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట. వీరమల్లు (పవన్) ఆమె మోసం చేస్తూ ఉంటుందట. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని టాక్. అందుకే పవన్ ని హాట్ బ్యూటీ మోసం చేస్తుందనే ప్రచారం అప్పుడే మొదలైపోయింది. అదెలా? ఎందుకు ?? అన్నది మాత్రం తెరపై చూడాల్సిందే.