అనిరుద్ డబుల్ బొనాంజా

సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ పంట పడింది. ఆయన ఒకే టైమ్ లో ఇటు ఎన్టీఆర్, అటు చరణ్ సినిమాలకు సంగీతం అందించబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో, రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు కూడా అనిరుద్ సంగీతం అందించబోతున్నారంట.

ఆగస్ట్ నుంచే కొరటాల-ఎన్టీఆర్ ల సినిమా మొదలు కానుంది. ఈ సినిమా కోసం అనిరుద్ ని తీసుకున్నారట. అతి త్వరలోనే ఆయన పని మొదలెట్టనున్నారని సమాచారమ్. మరోవైపు శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించేబోయే సినిమా కాస్త ఆలస్యం కానుంది. ఈ సినిమా కోసం కూడా అనిరుద్ పని చేయనున్నారు. శంకర్ సినిమాల కోసం సాధారణంగా ఏఆర్ రెహమాన్ పని చేస్తారు. ఐతే ఈసారి అనిరుద్ ని అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై కూడా ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నాయి.