ట్విట్టర్ దాటి రా.. రాములమ్మ !
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ని గట్టిగా విమర్శించే వారిలో విజయశాంతి ఒక్కరు. కాకపోతే ఆమె ట్విట్టర్ దాటి బయటికి రారు. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై సటైర్స్ వేస్తుంటారు. అవి బాగా పేలుతుంటాయ్. నెటిజన్స్ ని ఆకట్టుకొంటాయ్. ఆలోచింపజేస్తాయ్. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు.. ఇప్పుడు బిజెపీలో చేరినప్పుడు కూడా రాములమ్మది ట్విట్టర్ తో విమర్శలు చేస్తున్నారు. మొన్నలాక్ డౌన్ ఎత్తి వేసిన సందర్భంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్ చేసింది విజయశాంతి.
అయితే ఈసారి నెటిజన్స్ విజయశాంతికి షాక్ ఇచ్చారు. ఈసారి నెటిజన్లు విజయశాంతిని ట్విట్టర్ దాటి బయటకు వచ్చి నిజమైన కార్యక్రమాలు, నిజమైన పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈటెల రాజేందర్ లాంటి వారే ఇటీవల బిజెపిలో చేరి ర్యాలీ లు చేస్తున్నారని, మరి ఇవి విజయశాంతికి ఎందుకు కనపడవని ప్రశ్నిస్తున్నారు. తాను లేడీ సూపర్ స్టార్ ని, ఇంట్లో కూర్చుని తాను ట్విట్టర్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే సరిపోదని ఆమె అభిమానులే అంటున్నారు.
విజయశాంతి బయటికి రాకపోవడానికి పెద్దగా కారణాలు కూడా లేదు. ఆమె సినిమాలు చేయడం లేదు. ఇంట్లోనే ఉంటోంది. అలాంటప్పుడు బయటికొచ్చి పోరాటాలు చేస్తే నష్టమేంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి విజయశాంతిని బయటికి లాగేదాక నెటిజన్స్, ఆమె అభిమానులు వదిలేలా లేరు.