హుజూరాబాద్‌లో నోట్ల వరద
‘ఓట్ల పండగొచ్చె.. నోట్ల వరదపారె’ అన్నట్టుగా ఉంది హుజురాబాద్ లో పరిస్థితి. హుజూరాబాద్ లో గెలిస్తే టీఆర్ఎస్ కు ఎదురే లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచినట్టే. హ్యాట్రిక్ కొట్టినట్టే. అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికని గులాబి పార్టీ ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. ఎంతైనా ఖర్చుపెట్టేందుకు రెడీ అయింది. తెలంగాణలో బీజేపీ రేసులో ఉందని నిరూపించాలంటే.. హుజూరాబాద్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితి. అందుకే టీఆర్ఎస్‌తో పోటీగా డబ్బులు ఖర్చుపెట్టడంలో బీజేపీ వెనకాడబోదని తెలుస్తోంది.
అందుకే హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ ఇంచార్జీగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియమించారు. సహ ఇంచార్జ్‌లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించారు. ఎన్నికల ఖర్చులకు నిధులు సర్దడంలో నిరంజన్ రెడ్డి.. ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ హైకమాండ్‌కు కీలకమైన నేతగా ఉండేవారు. ఇప్పుడు ఆయన బీజేపీకి వరంగా మారారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజాపాకు డబ్బు కొరత లేకుండా చూసుకొనే బాధ్యత ఆయనే తీసుకొన్నారు. మొత్తానికి.. తెరాస, బీజీపీ రెండు హూజూరాబాద్ లో డబ్బుల వరదని పారించనున్నారు. దీంతో.. ఓటరు దేవుడికి పండగే పండగ.