ఆస్తులు అమ్ముకుంటున్న సీనియర్ హీరో
టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు విలువైన ఆస్తులని అమ్ముకుంటున్నారట. అయితే దీని వెనక ఓ మంచి ప్లాన్ నే ఉందని సమాచారమ్. ఆయనకు చిన్నా, చితక అప్పులు ఉన్నాయట. దీంతో ఫిలిం నగర్ సమీపంలో వున్న విలువైన ప్రాపర్టీని అమ్మేసే పనిలో ఉన్నారంట.
వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసి, మిగిలిన మొత్తం మళ్లీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో వున్నట్లు సమాచారమ్. ఆ ప్రాపర్టీ అమ్మితే దాదాపు రూ. 200 కోట్ల వరకు వస్తుందట. బేరం తెగితే అతి త్వరలోనే సేల్ వ్యవహారం పూర్తవుతుందట. ప్రస్తుతం ఈహీరో రెండు సొంత సినిమాలే చేస్తున్నారట. ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరంటారు ?