కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేరుస్తున్న ప్రశాంత్ కిషోర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ బలమైన కోరిక ఉంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేటర కూటమిని ఏర్పాటు చేయాలి. దాన్ని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ పై గట్టిగానే మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీకి పోతా. అన్నీ పార్టీలని ఏకం చేస్తా. గత్తరలేపుతా. కేంద్రంలో బీజీపీ, కాంగ్రెస్ యేతర కూటమిని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నిజంగా అందుకోసం కొన్ని ప్రయత్నాలైతే చేశారు. కానీ కూటమిని ఏర్పాటు చేయడంలో ముందడుగు వేయలేకపోయారు.

ఇప్పుడీ.. ఈ బాధ్యతని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 2014లో మోడీ ప్రధాని కావడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిసిందే. ఆ తర్వాత ఢిల్లీలో క్రేజీవాల్ ని, ఏపీలో జగన్ ని, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని, తమిళనాడులో ఎం.కె స్టాలిన్ ని సీఎంలని చేశాడు. అయితే ప్రశాంత్ కిషోర్ అసలు టార్గెట్ మాత్రం కేంద్రంలో భాజాపా, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. ఇందుకోసం ఆయన ఇప్పడి నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు.

ఇటీవల నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ చర్చలు జరిపారు.2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా ఈ భేటీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తొలుత జూన్ 11న ముంబయిలో శరద్ పవార్ నివాసంలో దాదాపు 3 గంటల పాటు సమావేశం జరగ్గా, తాజాగా ఢిల్లీలో అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చిన థర్డ్ ఫ్రెంట్ కోసం ప్రశాంత్ కిశోర్ కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంతే.. సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని ఆయన నెరవేర్చే పనిలో ఉన్నారు.

ఇక టీఆర్ ఎస్ కోసం ప్రశాంత్ కిశోర్ పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తెరాసని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన వ్యూహాలు అందించనున్నారని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ కిశోర్ ప్రయత్నం చేస్తున్న థర్డ్ ఫ్రంట్ కు టీఆర్ ఎస్ ఎలాగూ మద్దతు తెలుపుతుంది. వైసీపీకి కూడా మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని సమాచారమ్.