యాదాద్రి పునర్మాణ పనులు.. ఇదే ఆఖరి డెడ్ లైన్ !
యాదాద్రి పునర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే మిగిలిన పనులన్నింటినీ రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ పర్యటన ముగించుకుని వస్తూ మార్గం మధ్యలో ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు. స్వామివారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వవచనం తీసుకున్నారు.
అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయం బయట, లోపల జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధింత అధికారులను సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్టలో బస్‌స్టాండ్, బస్‌డిపో నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని.. 3 నెలల్లోగా ఆ నిర్మాణ పనులు పూర్తి కావాలని సీఎం ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”es” dir=”ltr”>Live: Honourable CM Sri KCR visit to Yadadri temple. <a href=”https://t.co/Xdv45W3Qem”>https://t.co/Xdv45W3Qem</a></p>— Telangana CMO (@TelanganaCMO) <a href=”https://twitter.com/TelanganaCMO/status/1406972998431625216?ref_src=twsrc%5Etfw”>June 21, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>