వాసాలమర్రిపై కేసీఆర్ వరాల జల్లు
వాసాలమర్రి గ్రామం పంట పండింది. గ్రామంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వాసాలమర్రి గ్రామంలోని ప్రతిఒక్కరు నా కుటుంబ సభ్యులే. వారిని వృద్ధిలోకి తీసుకురావడం నా బాధ్యత అన్నారు సీఎం కేసీఆర్. ఐక్యమత్యంగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ది చేసుకుందామని పిలుపునిచ్చారు.
గ్రామ అభివృద్ది కోసం రూ. 100-150కోట్లు ఖర్చు చేసుకునేందుకు రెడీ. ఇళ్లులేని వారికి ఇళ్లు కట్టిద్దాం. రోడ్లు బాగుచేసుకుందాం. అద్భుతమైన కమిటీ హాల్ నిర్మించుకుందాం. చుట్టుపక్కల గ్రామస్థులు వచ్చి.. మీ గ్రామంలో పెళ్లిళ్లు చేసుకొనేలా కమిటీ హాల్ నిర్మించుకుందాం అన్నారు. ఇక ప్రస్తుతం గ్రామంలో అనారోగ్యంతో ఉన్న వారికి వెంటనే చికిత్స చేయిద్దాం. ప్రభుత్వ ఖర్చుతోనే చికిత్స చేయిద్దాం. రేషన్ కార్డులు లేనివారికి.. అవి ఇప్పిద్దాం. ఇక నుంచి కలెక్టర్ గ్రామ అభివృద్ది పనులు చూస్తుందని తెలిపారు.
మొత్తానికి సీఎం కేసీఆర్ రాకతో వాసాలమర్రి గ్రామ స్వరూపమే మారిపోనుంది. దాదాపు రూ. 100కోట్లపైగా ఖర్చుతో గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు కేసీఆర్ నడుంబిగించారు. గ్రామ అభివృద్ది కోసం పలు కమిటీలు వేసుకొని అభివృద్ది చేసుకుందాం. గ్రామస్థులు చేయాల్సిందల్లా ఒక్కటే.. ఐక్యమత్యంగా ఉండటం. ఐక్యమత్యంగా పనిచేయడమని తెలిపారు.
Live: CM Sri KCR participating in Grama Sabha with Vasalamarri villagers https://t.co/Wb1rAknPZA— Telangana CMO (@TelanganaCMO) June 22, 2021