స్పెష‌ల్ సారీలో తాప్సీ.. పిచ్చ కూల్‌ !

సొట్టబుగ్గల సుందరి తాప్సీ స్పెష‌ల్ సారీలో చిల్లింగ్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రిలాక్స్ అయ్యేందుకు సోదరి షాగున్‌తో క‌లిసి ర‌ష్యా టూర్ కి వెళ్లింది. అక్కడ అన్నీ నగరాలని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది. 

ఇక సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో స్పెషల్ సారీలో ఓ డిన్న‌ర్‌కు అటెండ్ అయ్యింది. బ్లూ క‌ల‌ర్ బ్లౌజ్, లైట్ కలర్ డిజైనింగ్ సారీలో చిల్లింగ్ గా కనిపించింది. దానికితోడు  స‌న్‌గ్లాసెస్‌, జుట్టు కట్టేసి.. స్పెషల్ గా కనిపించింది తాప్సీ. దానికి సంబంధించిన ఫోటోని తాప్సీ తన ఇన్ స్టా గ్రాములో షేర్ చేసింది. ఇప్పుడీ.. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగులో తాప్సీ పలు సినిమాల్లో నటించినా.. ఆమెకు కలిసి రాలేదు. బాలీవుడ్ లో మాత్రం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రస్తుతం బిజీగా ఉంది. తాప్సీ న‌టించిన ‘హ‌సీనా దిల్‌రుబా’ చిత్రం త్వ‌ర‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం తాప్సీ లూప్ ల‌పేటా, ర‌శ్మీ రాకెట్‌, శాభాష్ మిట్టు చిత్రాల్లో నటిస్తోంది.