ఓటీటీలోకి ఈటీవీ
సినిమా ప్రపంచం అంతా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తోంది. తెలుగులోనూ ఓటీటీ వేదికలు పెరుగుతున్నాయి. ఆహా, జీ5 లాంటి వేదికలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇప్పుడు ఈటీవీ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. తొలి విడతగా 200 కోట్లపెట్టుబడి పెట్టబోతోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ లనిర్మాణం, టాక్ షోల విషయంలో కసరత్తు సాగిస్తున్నారు. రచయితలు కావాలంటూ ఓ ప్రెస్ నోట్ ని కూడా వదిలారు. వర్థమాన దర్శకులతో సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు తీసుకు రానుంది.
ఈటీవీలో వందల కొద్దీ సినిమాలున్నాయి. ఇవన్నీ ఈటీవీలో తప్ప ఇంకెక్కడా చూడలేం. ఇప్పుడు ఇవన్నీ ఈ-ఓటీటీకి మూలధనం కానున్నాయ్. అయితే వెబ్ సిరీస్‌లూ, టాక్ షోలూ, సినిమాలూ.. ఇవన్నీ కావాలి కదా. అందుకే తొలి విడతగా 200 కోట్లపెట్టుబడి పెట్టబోతోంది. రామోజీరావు ఏం చేసిన దీర్ఘకాలిక ప్రయోజనాలతో ప్లాన్ చేస్తారు. గ్రాండ్ చేస్తారు. ఓటీటీని కూడా అదే తరహా పక్కా ప్రణాఌకతో తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.