పరువు నష్టం కేసు : మాజీ ప్రధానికి భారీ జరిమానా
పరువు నష్టం కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు సివిల్ కోర్టు రూ. 2కోట్ల జరిమానా విధించింది. 2011 జూన్ 28న ‘గౌడర గర్జన’ పేరుతో నిర్వహించిన ఓ టీవీ షోలోదేవెగౌడ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(NICE) ప్రాజెక్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఆ కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్ కోర్టు NICE ఆరోపణల్లో నిజం ఉందని తేల్చింది. కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు NICEకి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ జరిమానాపై దేవెగౌడ ఇంకా స్పందించలేదు.