2 పరుగులకేఆలౌట్.. 10 మంది డకౌట్‌ !

అది ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌..  హంటింగ్‌డాన్‌షైర్ కౌంటీ లీగ్‌. ఫాల్కన్-బక్డెన్ జట్ల మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం 261 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బక్డెన్‌ జట్టు కేవలం 2 పరుగులకే ఆలౌటైంది.

పదికి పది మంది ఆటగాళ్లు డకౌట్‌. ఆ రెండు పరుగులు కూడా వైడ్, నోబాల్ రూపంలో వచ్చినవే. దీంతో.. ఫాల్కన్ జట్టు 258 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌లోనే ఇదో చెత్త రికార్డ్. ఫాల్కర్ జట్టు బౌలర్లు అమన్‌దీప్‌సింగ్ (6/0), హైదర్ అలీ (2/0) రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఇప్పుడీ.. ఈ మ్యాచ్ కి చెందిన స్కోర్ బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత దారుణమా ? 2 పరుగులకే ఆలౌట్ ఏంటీ ?? అంటూ నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.