బీజేపీ చేతిలో శిఖండిలా మారిన కేసీఆర్..!!
రాష్ట్ర విభజన హామీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేఖ శక్తుల కూటమి పేరుతో కేసీఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారు. బీజేపీ తీరు వ్యతిరేకించేవారైతే బీజేపీయేతర ముఖ్యమంత్రులు నలుగురు సమావేశమై కేజ్రీవాల్ కి సంఘీభావం తెలిపితే కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కని, దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల బదిలీల్లో పాత జిల్లాలను పరిగణనలోకి ప్రభుత్వం తీసుకుంటే, జిల్లాల విభజనను కేంద్రం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, ఓబీసీ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనడమే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. బీజేపీ చేతిలో కేసీఆర్ శిఖండిలా మారారని ఆయన విమర్శించారు.