ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్ ?
దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేయడం, ఆంక్షలు సడలించడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్ రావచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో కరోనా ధర్డ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉండే అవకాశముందని అంచనా వేశారు.సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుందన్న దానిపై అంచనా వేశారు. మరోవైపు ధర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండే అవకాశాలున్నాయనే ప్రచారం ఉంది. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు అంటున్నారు. మొత్తానికి.. దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. అది ఎప్పుడు ? అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయం.