3 కోట్లు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 3 కోట్లు దాటాయి. గతేడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసింది. అప్పటి నుంచి రెండుదశల్లో మహమ్మారి విజృంభించింది. రెండు దశల్లో కలిపి మొత్తం మూడు కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయ్. రికవరీ కూడా అదే రేంజ్ లో ఉండటం విశేషం. ఇప్పటి వరకు 2.9కోట్ల మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 3,90,660 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 50,848 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 1,358 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 68,817 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు 6.4లక్షలకు తగ్గగా.. ఆ రేటు 2.21 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 96.5 శాతానికి పెరిగింది.