లైవ్ లో నాగబాబు పరువు తీసుకున్నాడు

తమ్ముడి పార్టీ ‘జనసేన’లో తనది కీలక పాత్రని మెగా బ్రదర్ నాగబాబు హడావుడి చేస్తుంటాడు. కానీ ఆయనకు అంతలేదు. అసలు నాగబాబు సీరియస్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషియన్ అని ప్రత్యర్థి వర్గాలు విమర్శిస్తుంటాయ్. ఆ ఆరోపణలు నిజమేనని తాజాగా నాగబాబు క్లారిటీ ఇచ్చినట్టయింది.

త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడనున్నారు. జీవిత రాజశేఖర్ కూడా పోటీకి దిగుతారని తెలుస్తోంది. వీరిలో ప్రకాష్ రాజ్ కి  కి చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. చిరంజీవి అనుమతి తీసుకున్న తర్వాతే ప్రకాష్ రాజ్ పోటీ దిగాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కి మద్దతుగా  మీడియా డిస్కషన్లో కూర్చున్నారు నాగబాబు.

సినిమా కుటుంబం అంతా ఒకటే, కానీ కుటుంబ సభ్యులకు వేర్వేరు అభిప్రాయాలుంటాయని చెప్పాలనుకున్నారు. ఆ క్రమంలో మా ఇంట్లో కూడా అప్పట్లో అన్నయ్య కాంగ్రెస్, తమ్ముడు జనసేన అనబోయి తడబడ్డారు. సొంత పార్టీ పేరు గుర్తురాక తటపటాయించాడు. లైవ్ చూస్తున్న వారికి నాగబాబుకు జనసేన పార్టీ గుర్తుకు రావడం లేదని అర్థమైపోయింది. నాగబాబు పరువుపోయింది. హావ్వా.. సొంత పార్టీ పేరు మరిచిపోయాడా ? అని కామెంట్స్ చేస్తున్నారు.