8వ తరగతి వరకు టీసీ అవసరం లేదు

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయ్. స్కూల్ మారకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయ్. వాటికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై 8వ తరగతి వరకు టీసీ అవసరం లేదని తెలిపింది. విద్యాహక్కు చట్టంలో టీసీ అవసరం లేదన్న విషయం స్పష్టంగావిద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన అన్నారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆయా జిల్లాల్లోని డీఈవోలను సంప్రదించాలని సూచించారు. కొత్త పాఠశాలల్లో చైల్డ్ ఇన్ఫో డేటాలో పేరు నమోదు అయ్యేలా చూడాలని శ్రీదేవసేన సూచించారు.