జీవిత ప్రాపర్టీపై ఉపాసన ఆసక్తి

హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితకు ఫిలిం నగర్ సమీపంలో ఓ ఖరీదైన ప్రాపర్టీ వుంది. దాన్ని డెవలప్ మెంట్ ఇచ్చారు. వీళ్ల వంతుకు అద్దెలు వస్తున్నాయి. దాని విలువ దాదాపు రూ. 200కోట్లు. ఇప్పుడు దాన్ని అమ్మకానికి పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిని కొనడానికి హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఆసక్తి కనబరిచారని, బేరాలు సాగుతున్నాయని తెలుస్తోంది.ఈ విక్రయం తరువాత తమకున్న చిన్నా.. చితక బాకీలు తీర్చేసి.. విప్రో సర్కిల్ ప్రాంతంలో ఫినీక్స్  డెవలప్ చేసిన కమర్షియల్ ప్లేస్ ను కొనుగోలు చేసే ఆలోచనలో జీవిత రాజశేఖర్ వున్నారని సమాచారమ్.