మరోసారి కేసీఆర్ ముందస్తు వ్యూహాం ?
ఎన్నికల్లో గెలుపు కోసం టైమింగ్ కూడా ముఖ్యమని సీఎం కేసీఆర్ నమ్ముతారు. అందుకే.. గతంలో ఆరు నెలలు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. మంచిఫలితాలు సాధించారు. మరోసారి ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నజర్ పెట్టారని అంటున్నారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి కొన్ని మీడియా వర్గాలకు లీకులు అందాయని చెబుతున్నారు.
ముందస్తు వెళ్లడం వెనక సీఎం కేసీఆర్ ప్రధాన వ్యూహాం… విపక్షాలకు తగిన ప్రచార సమయం దొరక్కుండా చేయడం. అవి బలపడక ముందే ఎన్నికలకు వెళ్లడం. పోయినసారి అదే చేశారు. అది మంచి ఫలితాలు ఇచ్చింది. మరోసారి అదే ఫార్ములాని ఫాలో కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలకి ముందే తనయుడు కేటీఆర్ ని సీఎం చేస్తారా ? లేక తర్వాత నా ?? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
2023లో ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. గట్టిగా రెండేళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ మరోసారి ముందస్తుకు వెళ్లి … విపక్షాలు బలపడకముందే.. మరో ఐదేళ్లు టర్మ్ పెంచుకుంటే… ఆ తర్వాత ఎదురు ఉండదన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ప్రగతి భవన్ గేటు దాటని ఆయన ఇప్పుడు.. జిల్లాల బాట పట్టారని చెప్పుకుంటున్నారు.