తెలుగు రాష్ట్రాలు మల్లేశ్వరిని ఎందుకు పట్టించుకోలేదు ?
దేశానికి ఒలంపిక్ మెడల్స్ సాధించినకరణం మల్లేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కి తొలి వైస్ ఛాన్సలర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మల్లేశ్వరి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు.. గర్వపడుతున్నారు. గొప్పగా చెప్పుకొంటున్నారు.
మరోవైపు సోషల్ మీడియా వేదిక ఓ చర్చ మొదలైంది. భారతదేశానికి తొలి ఒలింపిక్ మెడల్ తెచ్చిన మహిళ తెలుగువారు కావడం మన అదృష్టమని, కానీ అలాంటి మల్లీశ్వరి సేవలని తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోలేక పోవడం మన దురదృష్టం అని సోషల్ మీడియాలో చర్చ కొనసాగింది.
ఈ నేపథ్యంలో టీవీ చానల్స్ మల్లీశ్వరి ని ఇదే విషయమై ప్రశ్నించాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గ్రామీణ యువత నుండి క్రీడాకారులను తయారు చేసే విధంగా అకాడమీని ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహిస్తామని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్థలం కూడా ప్రభుత్వమే ఇస్తుందని మాట ఇచ్చారని, కానీ ఆ ప్రపోజల్ ముందుకు సాగలేదని తెలిపారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రోత్సాహానికి అవకాశం వస్తే.. తనవంతు కృష్హి చేస్తానని తెలిపారు.