కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకి రూ.2 లక్షలు

కరోనా సెకండ్ వేవ్ లో దాదాపు 70 మంది జర్నలిస్టులు మృతి చెందారు. ఇప్పుడు వారి కుటుంబాలని ఆదుకొనేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ముందుకొచ్చింది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థికసాయం అందించనుంది. దీంతో పాటు ప్రతినెలా రూ. 3వేల ఫించన్ అందించనుంది. ఐదేళ్ల వరకు ఈ ఫించన్ ఇస్తారు.

మీడియా అకాడమీ ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10–2–1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్‌ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌.