ఎక్కడ వాలితే.. అక్కడో ఇల్లు !

హీరోయిన్స్ ఈజీగా ఎగిరిపోతారు. టాలీవుడ్ లో హిట్ అయితే కోలీవుడ్.. బాలీవుడ్ ఎగిరిపోతారు. అక్కడ ఏమాత్రం సక్సెస్ అయినా అక్కడో గూడు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందన అదే చేసింది. టాలీవుడ్ లో జెడ్ స్పీడులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రస్మిక. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. గీత గోవిందం, వరల్డ్ ఫేమస్ లవ్వర్, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకొంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

అక్కడ ఒకేసారి గుడ్‌ బై, మిస్టర్‌ మజ్ను సినిమాల్లో నటిస్తూనే.. మరో సినిమాకు కూడా సైన్‌ చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోనూ రస్మిక జెడ్ స్పీడుతో దూసుకుపోయేలా ఉంది. బహుశా.. అందుకేనేమో అక్కడ ఓ ఇల్లు కొనేసింది. ఇటీవలె రష్మిక ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడీ.. ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయింది.

ఈ విష‌యాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియ‌జేస్తూ.. ఎట్టకేలకు కొత్త అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్‌ అయ్యాను. దీనికోసం చాలానే షాపింగ్‌ చేయాల్సి వచ్చింది. అయితే నేను కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నా అసిస్టెంట్‌ సాయి నాకు ఇళ్లు షిఫ్ట్‌ అవ్వడంలో సహాయం చేశాడు. ఆరా(పప్పీ) నేను చాలా అలసటతో ఉన్నా దానిని అధిగమించాం అంటూ రాసుకొచ్చింది.