‘మా’ ఎన్నికల బరిలో కల్యాణ్ రామ్ ?

మా ఎన్నికల హీట్ మూడ్నెళ్ల ముందే మొదలైంది. అధ్యక్ష పదవి కోసం నాలుగు స్తంభాలట మొదలైంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీలో ఉంటున్నట్టు ప్రకటించారు. సడెన్ గా నందమూరి హీరో కల్యాణ్ రామ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మా ఎన్నికల బరిలో కల్యాణ్ రామ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

దీనిపై కల్యాణ్ రామ్ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని.. కళ్యాణ్ రామ్ ‘మా’ ఎన్నికల్లో నిలబడటం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యుల జాబితాని కూడా ప్రకటించేశారు. 27 మందితో కూడిన జాబితాని విడుదల చేశారు.