‘గజిని’ కథని రిజెక్ట్ చేసిన 11 మంది హీరోలు.. వీరే !

ఒక హీరో కోసం రాసుకొన్న కథ మరో హీరోతో తెరకెక్కడం సినీ పరిశ్రమలో సహజమే. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం రాసుకొన్న చాలా కథలు ఇతర హీరోలతో తెరకెక్కాయ్. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఇండస్ట్రీ రికార్డులని  నెలకొల్పాయి. పూరి దర్శకత్వంలో రవితేజ నటించిన సినిమాలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా-నాన్న.. ఓ తమిళ అమ్మాయి, పోకిరి.. అన్నీ పవన్ కోసం రాసుకొన్నవే. ఆయనకి కథలు కూడా వినిపించాడు పూరి. బాగున్నాయ్ అన్నాడు.. కానీ పవన్ సినిమాలు చేయలేదట.

ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వచ్చిన ‘అతడు’ సినిమా కూడా పవన్ కోసం రాసుకున్నదే. పవన్ నో చెప్పడంతో.. అతడుని మహేష్ తో చేయాల్సి వచ్చింది. ఇక కోలీవుడ్ హీరో సూర్యని స్టార్ ని చేసిన ‘గజిని’ సినిమా వెనక ఇలాంటి కథనే ఉంది. సూర్య కంటే ముందు ఈ కథని 11 మంది హీరోలకు చెప్పాడట దర్శకుడు ఏఆర్ మురగదాస్. వారందరు రిజక్ట్ చేశారట. పైనల్ గా సూర్య ఓకే చేశారు. ఆయన కెరీర్ లో మరిచిపోని చిత్రంగా నిలిచింది. గజనిని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ రిమేక్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గజని కథని రిజెక్ట్ చేసిన ఆ 11 మంది నిజంగానే దురదృష్టవంతులే.