మాస్ట్రో.. మూడు కోట్ల లాభం !
నితిన్ సినిమా ‘మాస్ట్రో’ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటిటి డీల్ ను క్లోజ్ చేసారు. హాట్ స్టార్ తో 32 కోట్లకు డీల్ క్లోజ్ అయింది. అంథాదూన్ సినిమా ఆధారంగా ‘మాస్ట్రో’ను నిర్మించారు. దాదాపు 29 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. అంటే.. రిలీజ్ ముందే నిర్మాతకు రూ. 3 కోట్ల టేబుల్ ప్రాఫిట్ అన్నమాట. ఇదీగాక.. అడియో రైట్స్, ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ నిర్మాతకు వున్నాయి. పబ్లిసిటీ ఖర్చులు కూడా మిగిలాయ్. మొత్తానికి.. మాస్ట్రో ఓటీటీ రిలీజ్ తో నిర్మాత మాత్రం హ్యాపీ.
క్రైమ్ థ్రిల్లర్ గా మాస్ట్రో తెరకెక్కింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. నితిన్-నభా నటేష్ నటించారు. స్టార్ హీరోయిన్ తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూలై నెలాఖరుకల్లా కాపీ ఫినిష్ చేసి అందించాల్సి వుంటుంది. ఆగస్టు రెండో వారంలో మాస్ట్రో విడుదల వుండొచ్చు.