చీరలో పూజా అందాలు.. కేక !

తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులని బుట్టలో వేసుకుంది పూజాహెగ్డే. ఇప్పుడు ఆమె ఏం చేసినా.. చూసేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ ఓ రౌండ్ వేసేసింది. ఇప్పుడు రెండో రౌండ్ కి కూడా రెడీ అయిపోయింది.

సినిమాలతో బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడు ఫోటో షూట్ చేస్తుంటుంది.. ఈ బ్యూటీ. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అభిమానులని ఖుషి చేస్తుంటుంది. తాజాగా చీరలో బుట్టబొమ్మ మెరిసిపోతుంది. 360 అందాలని ఆరబోస్తూ స్టిల్ ఇచ్చింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. బుట్టబొమ్మ ఎలా కనిపించినా.. ముద్దే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో నటిస్తోంది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 6వ సినిమా #Beast హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హిట్టైతే.. కోలీవుడ్ లోనూ బుట్టబొమ్మ హవా మొదలైనట్టే. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లోనూ రాణిస్తోంది. ఇక కోలీవుడ్ లోనూ హిట్టైతే.. మూడు పువ్వులు, ఆరు కాయలుగా పూజా హెగ్డే కెరీర్ ముందుకు సాగడం ఖాయం.