ప్రాణంపోయినా కొత్త సెక్ర‌టేరియ‌ట్ క‌ట్ట‌నివ్వ‌ను..!!

కాళేశ్వ‌రం ప్రాజెక్టు కు కేంద్రం నిధులు ఇవ్వాలని విభజన హామీలో ఉన్నా కేసీఆర్ కేంద్రాన్ని బిక్షం అడుగుతున్నాడని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం కేసీఆర్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. అప్పులు తెచ్చి ట్యాక్స్ లు పెంచి, మీ చావు మీరు చావండి అన్నట్లు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. వాస్తు పేరు చెప్పి ప్రజాధనం వృదా చేస్తున్నాని, త‌న‌ ప్రాణం పోయినా కొత్త సెక్రటేరియట్ కట్టనివ్వన‌ని ఆయ‌న చెప్పారు. సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రి కి కొత్త సెక్రటేరియట్ ఎందుకని ప్ర‌శ్నించారు. బైసన్ పోల్ గ్రౌండ్ లో వివిధ రకాల ఆటలాడుతుంటార‌ని, వారి ప‌రిస్థితి ఏమిట‌ని అన్నారు. కొత్త సెక్రటేరియట్ కు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకో లు చేస్తామ‌న్నారు.