ఏపీ సర్కారుకు ‘న్యాయ’ అభినందనలు
తిట్టిన నోటితోనే పొగిడించుకోవడం అంటే ఇదే. న్యాయస్థానాల నుంచి ఎప్పుడూ ఏపీ ప్రభుత్వానికి చివాట్లు పడేవి. ప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితి. అయితే తొలిసారి ఏపీ సర్కార్ కు న్యాయ అభినందనలు దక్కాయ్. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది. పరీక్షల రద్దు మానవీయతకు సంబంధించిన అంశమని పేర్కొంది. జులై 31లోగా ఫలితాలు వెల్లడించాలని తెలిపింది.