తండ్రిపై కోర్టుకెక్కిన సెలబ్రెటీ
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకుంది. అయితే ఆమె జీవితం మాత్రం ఆనందంగా సాగడం లేదు. తన తండ్రే ఆమెను సుఖంగా ఉండనివ్వలేదు. అందుకే తన తండ్రి జేమీ స్పియర్స్ చెర నుంచి రక్షించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇకపై తన సంరక్షకుడిగా తండ్రి జేమీ ఉండకూడదని అమెరికాలోని ఓ ఉన్నత న్యాయస్థానాన్ని బ్రిట్నీ కోరింది.
39 ఏళ్ల బ్రిట్నీ 2004లో తన చిన్ననాటి స్నేహితుడు జేసన్ అలెగ్జాండర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జేసన్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం డ్యాన్సర్ కెవిన్ ఫెడెర్లైన్ని రెండో పెళ్లి చేసుకుంది. కెవిన్తోనూ వివాహ బంధాన్ని కొనసాగించలేదు. దాంతో 2008 నుంచి తండ్రి సంరక్షణలోనే ఉంది. అప్పటి నుంచి ఆయనే బ్రిట్నీ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు. అయితే నా తండ్రివల్ల నేను ఎప్పుడూ సంతోషంగా లేను. ఏ రోజూ సరిగా నిద్ర కూడా పోలేదు. దయ చేసి ఆయన చెర నుంచి తనకి విముక్తి కల్పించమని కోర్టుకెక్కింది.