గెటప్ ట్రయిల్స్ లో తారక్

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. తిరిగి షూటింగ్స్, థియేటర్స్ కి అనుమతులు లభించాయ్. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తన రెగ్యులర్ వర్క్ లోకి వచ్చేసారు.  ఆర్ఆర్ఆర్ ఓ చిన్న షెడ్యూలు ఫినిష్ చేశారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ప్రిపరేషన్ సెషల్ లో పాల్గొన్నారు. ఓ రోజంతా ఫొటో సెషన్ చేసారు. పలు రకాల డ్రెస్ లు మార్చి, లైట్ గా గెటప్ మార్చి చూశారు. అయితే ఇంకా ఏ గెటప్ ఫైనల్ కాలేదని, మరో రోజు ఈ ట్రయిల్స్ కొనసాగుతాయని తెలుస్తోంది. జూలై నెలాఖరు నుంచి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ నుంచి ఫ్రీ అయిపోతారు. అప్పటి నుంచే మీలో ఎవరు కోటీశ్వరుడు షూట్ ప్రారంభం కానుంది. ఇక ఆగస్టు నుంచి కొరటాల సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు తారక్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది.