27న ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్’పై అఖిలపక్ష భేటీ
దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్’ పథకానికి కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఈ నెల 27న (ఆదివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు ఎంఐఎం, కాంగ్రెస్, భాజపా తదితర పార్టీల శాసనసభాపక్ష నేతలు హాజరవుతారు. సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపాలని ఇప్పటికే ఆయా పార్టీ అధ్యక్షులకు సీఎం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.