శుభ్‌మన్‌గిల్‌.. మరో లక్ష్మణుడు!

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ లక్ష్మణ్‌ లాంటోడని మాజీ సెలెక్టర్‌ గగన్‌ఖోడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఖోడా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. “శుభ్‌మన్‌గిల్‌ ఓపెనర్‌ కాదు. అతడు లక్ష్మణ్‌ లాంటోడు. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలి. WTC తుదిపోరులో ఓపెనర్‌గా గిల్‌ స్థానంలో టీమ్‌ఇండియా మయాంక్‌ అగర్వాల్‌ను తీసుకోవాల్సింది.

అతడు రెండు టెస్టులు మాత్రమే సరిగ్గా ఆడలేదు. అలాగే పృథ్వీషాను కూడా ఆస్ట్రేలియాలో ఒక్క మ్యాచ్‌లో విఫలమయ్యాక జట్టు నుంచి తప్పించారు. ఇక ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ లేదా బ్యాటింగ్ సామర్థ్యం గల ఫాస్ట్‌బౌలర్‌ను తీసుకోవాల్సింది. శార్దూల్‌ ఠాకూర్‌ లాంటి ఆటగాడైతే పనిపూర్తి చేసేవాడు’ అని అన్నారు.