మా ఎన్నికలు ఏకగ్రీవం.. ఇంకా ఆ ఛాన్స్ ఉందా ?
మా ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. పెద్దలు దాసరి నారాయణ రావు ఉన్నప్పుడు కూర్చోబెట్టి.. మాట్లాడి ఏకగ్రీవం చేసేవారు. ఆ తర్వాత పరిస్థితి మారింది. ఎన్నికలు అనివార్యం అయ్యాయ్. ఇప్పుడు ఏకంగా మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపిస్తున్నాయి. మూడ్నెళ్ల ముందు నుంచే మా ఎన్నికల హీట్ మొదలైంది. రోజురోజుకి ఆ హీట్ పెరుగుతూ పోతుంది. అయితే ఇప్పటికీ మా ఎన్నికల ఏకగ్రీవానికి ఛాన్స్ ఉందని సమాచారమ్.
పెద్దలు చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు.. వీళ్లంతా కలిసి, ఓ మీటింగ్ ఏర్పాటు చేసి, మా
ఎన్నికలు లేకుండానే అధ్యక్షుడ్ని ఏకగ్రీవం చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కామెంట్లు కూడా అందుకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.
“మా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మధ్యలో జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈలోగా ఇంత తొందర ఎందుకో అర్థం కాదు. ఈసారి మా అధ్యక్షురాలిగా ఓ మహిళకు అవకాశం ఇద్దామనుకున్నాం. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుంది అనిపించింది. క్రమశిక్షణ సంఘం కూడా అదే ఆలోచిస్తోంది. పెద్దలు కూర్చుని మాట్లాడుకోవాలి. ఆ తరవాత నిర్ణయం తీసుకుంటారు“ అని నరేష్ చెప్పుకొచ్చారు.