కేసీఆర్ ట్రాప్’లో కాంగ్రెస్ నేతలు

సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవ్వరికీ అర్థంకావు. వాళ్లకి అర్థం అయ్యే లోపే.. కేసీఆర్ పని కానిచ్చేస్తారు. తాజాగా మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలాంటి ట్రాప్‌లోనే పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక్క సారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తొలిసారి వారికి అపాయింట్‌మెంట్ లభించింది. వారికోసం శుక్రవారం ప్రగతి భవన్ గేట్లు తెరచుకున్నాయి. ఈ ఆనందంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ ని కలిశారు.

కొద్ది రోజుల కిందట మరియమ్మ అనే మహిళ యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్‌ గురించి కాంగ్రెస్ నేతలు సీఎం ని కలిశారు. కానీ వాళ్లు పొలిటికల్ అప్ డేట్ లో లేరు. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంది. ఈ సమయంలో సీఎం ని కలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి అనే సృహా వారిలో కరువైంది. వారిలో లోపించిన రాజకీయ పరిణితిని సీఎం కేసీఆర్ క్యాష్ చేసుకున్నారు.

హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓట్లను టీఆర్ఎస్‌కు బదలాయింపు చేయడానికే భేటీ జరిగిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సాధారణ ప్రజల్లోకి ఈ భావాన్ని తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ నేటలు ఎలాగూ ప్రయత్నాలు చేస్తుంటోంది. మొత్తానికి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ ట్రాప్ పడ్డారు. వీళ్లే మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకొంటారు. వారి వ్యూహాలు ఇలా ఏడిస్తే.. ప్రత్యామ్నాయం ఎలా అవుతారు ? పత్తాలేకుండా పోతారు కానీ.. !