మా ఎన్నికలు : కరాటే కల్యాణి కొత్త డిమాండ్

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలకు తన ప్యానల్‌ను పరిచయం చేస్తూ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం మీడియా సమావేశం పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరిన కొంతమంది, ప్రస్తుతం పదవిలో ఉన్న ‘మా’ కమిటీలోనూ సభ్యులుగా ఉన్నారు. దీనిపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం తెలిపింది.

‘మా’ సభ్యులు ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. అయితే ఒక కమిటీ ఫోర్స్‌లో ఉన్నప్పుడు అందులోని సభ్యులు కొత్త ప్యానల్‌లో చేరడం తప్పు. వాళ్లని సస్పెండ్‌ చేయాలని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. నిన్నటి ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ కు కౌంటర్‌ గా ఈరోజు ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కరాటే కల్యాణి.. ఈ విషయాన్ని లేవనెత్తింది.