ప్రైవేటు ఏజెన్సీతో టీపీసీసీ స‌ర్వే…!!

మూడురోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర రాజ‌కీయాల‌పై రాహుల్ తో చ‌ర్చించామ‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ తెలిపారు. శక్తీ యాప్ ను ఎక్కువ మందికి చేరువ చేయాలని ,30600 ల బూత్ కమీటీ లను నియమించాలని రాహుల్ సూచించారని ఆయ‌న చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలు,ప్రజలకు ఇస్తున్న హామీలు ,ప్రజలకుచేరువయ్యేందుకు చేపడుతున్న కార్య‌క్ర‌మాల‌పై రాహుల్ వివ‌రాలు అడిగి తెలుసుకున్నార‌న్నారు.

తెలంగాణ పీసీసీ ఒక‌ సర్వే చేస్తోందని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ,ఎస్టాబ్లిష్ అయిన నేతల నియోజకవర్గాల్లో మినహా మిగతా నియోజకవర్గాల్లో ఎంతమంది అభ్యర్థులకు గెలుపు అవకాశాలున్నాయ‌నేదానిపై ప్రైవేట్ ఏజెన్సీతో సర్వేచేయిస్తున్నామ‌ని తెలిపారు ఉత్త‌మ్.. మిగతా రాష్రాలతో పాటు తెలంగాణ లో కూడా పార్టీ లో అన్ని పదవులు కేంద్ర నాయకత్వం భర్తీ చేస్తుందని, అందులో సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.