అపరిచితుడు.. సదా చెప్పిన సరదా సన్నివేశం !

‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది సదా. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ‘అపరిచితుడు’ ఆమెకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమా సినిమా సెట్స్ లో హీరో విక్రమ్ సదాని చెల్లి అని పిలిచేవారట. అది విని దర్శకుడు శంకర్ షాక్ అయ్యారట. ‘మిమ్మల్ని తెరపై రాముడు, సీతలా చూపిద్దామనుకుంటే’ మీరు ‘అన్నా-చెల్లి’ అనుకుంటూ ఉన్నారు. ఇది కనుక మీడియాకు లీకైతే నా సినిమా చూడటానికి ఎవరూ రారని అన్నారట. ఈ సరదా సన్నివేశాన్ని అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సదా చెప్పింది.

ఆ ఏపీసోడ్ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది. ఇందులో దర్శకుడు తేజ, ఎన్ టీఆర్, బాలకృష్ణ గురించి సదా చాలా విషయాలు చెప్పినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలు, అలవాట్ల గురించి కూడా సదా ఓపెన్ అయింది. ఒకప్పుడు వరుస అవకాశాలు దక్కించుకున్న సదా ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలు చేయకపోవడం వెనుక ఏం జరిగింది ? తెలియాలంటే.. నేటి పూర్తి ఏపీసోడ్ చూడాల్సిందే.